Sunday, February 27, 2011

ముమ్మాటికి నిజమే...! విశ్వ..!

మగ వాని హృదయాలు కటినమైన, కర్కసమైన చలనం లేని రాతి బండలట...
ఆడ వారి హృదయాలు మృధువైన, సున్నితమైన మలినం లేని వెన్న ముద్దలట...

నిజమే... ఇది ముమ్మాటికి నిజమే...

హృదయపు రాతి బండపై చెక్కిన చెలి అపురూప శిల్పాన్ని...
ముక్కలు చెక్కలు చేయాలే కాని మరమత్తులు చేయుట అసాధ్యం...
ఒకరు రూపాన్ని కొలువుంచిన ఆ బండబారిన హృదయంలో...
మరొక రూపాన్ని ఊహించడం ఉలి దెబ్బలు తిన్న ఆ శిలకు చేతకాదు...
అందుకే అన్నారు రాతి బండ లాంటి హృదయం మగ వానిది అని...

నిజమే... ఇది ముమ్మాటికి నిజమే...

వెన్న ముద్దలాంటి హృదయాన్ని పెద్దల పోయ్యపై చేర్చి...
వారి మాయ మాటల మంటలలో ఎదలోని ప్రేమను కడ తేర్చి...
మరిగే ప్రియుని రూపాన్ని మరుగున పడేసి మనసుని మార్చి...
ప్రేమపై ఉన్న నమ్మకాన్ని వంచించి ప్రియుని చితిపై పేర్చి...
ఆ కాలాగ్నిలో రూపాంతరం చెందే వెన్న ముద్దలాంటి హృదయం ఆడ వారిది...

నిజమే... ఇది ముమ్మాటికి నిజమే...

మగ వాని ప్రేమ పగను ఎరుగని అచంచలమైనది, ఎన్నటికీ మార్పు చెందనిది...
ఆడ వారి ప్రేమ సందర్భానుసారంగా మార్పు చెందే చంచల స్వభావం కలిగినది...! విశ్వ..!

Saturday, February 26, 2011

ప్రేమికుల రోజు....! విశ్వ...!


ప్రేమకు సన్నిధి ఈ రోజు.. ప్రేమికుల పెన్నిధి ఈ రోజు...
ప్రేమ మహిమాన్మిత త్యాగానికర్ధం ఈ రోజు.. ప్రేమ పరమ పధానికి పరమార్ధం ఈ రోజు...

యుగ యుగాలుగా తర తరాలుగా తరగని చరగని ప్రేమ సుగంధపు పరిమళ మీ రోజు...
ప్రేమికుల రోజు.. ప్రేమకు పుట్టిన రోజు.. హృదయ లయలో ప్రియ రాగం పలికిన రోజు...

మనసున దాగి ఉన్న మాట.. తెలుపగా పెదవి దాటు చోట...
ఇరు హృదయాల మధ్య ఆట.. రెండు ఉదయాల మధ్య వేట...
మనసున ఊగిసలాడే పాట.. పాడాలి అలుపెరుగక ఈ పూట...

ప్రేమికులకు ముఖ్య గమనిక :

ప్రేమ ఒక్కటే జీవితం కాదు, అలాగే ప్రేమించ లేని జీవితం ఎప్పటికి పరిపూర్ణం కాదు...
ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు...
జీవితాంతం.. అనంతం నీ తోడుగా నిలిచే బంధం, నీ నీడగా సాగే అనుబంధం ఈ ప్రేమ...
కుల, మత, జాతి, వర్ణ, ప్రాంతీయ భేదాలు.. విభేదాలు లేని ఒకే ఒక్క పదం ఈ ప్రేమ...
తల్లీ బిడ్డల తోలి స్పర్సలో వికసించే కుసుమం ఈ ప్రేమ...
భార్యా భర్తల తోలి అడుగులో చిగురించే మహా వృక్షం ఈ ప్రేమ...
ప్రేమించకుండా ప్రాణం ఉండలేదేమో, ప్రేమకు అందకుండా హృదయం స్పందించలేదేమో...
ప్రేమ విజయాన్ని కోరుకోనేదే కాని అపజయాన్ని కాదు...
ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కాని ఆత్మ త్యాగాన్ని కాదు...
ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకోనేదే నిజమైన ప్రేమ...
నాది నిజమైన ప్రేమ... మరి మీది...?
పిల్లలకు, పెద్దలకు, నవ యువతకు, కురు వృద్ధులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు...! విశ్వ..!

ఉదయ ఇందీవరం...! విశ్వ..!

నిరీక్షణం ఫలించగా నీ ధ్యాసలో అయ్యేను లీనం...
నిరంతరం నీ ఆలోచనలో అయ్యాను నే మిలీనం...

కురిసే ప్రతి చినుకులో కనిపించెనే నీ రూపం...
విరిసే ప్రతి పువ్వులో శ్వాసించెనే నీ పరిమళం...

ఎందుకే ఇంతలా కలిగించావు నాలో తొలి కలవరం...
ఎపుడూ నలతెరుగని నాలో పుట్టించావు చెలి జ్వరం...

ప్రేమ తపస్సులో జనించిన నీవు నా హృదయ వరం...
ప్రేమ ఉషాస్సులో వికసించిన నీవు నా ఉదయ ఇందీవరం...! విశ్వ..!

ప్రాణం పోయినా వదలను నీ చేయి....! విశ్వ...!

నువ్వు దోచుకెళ్లిన హృదయానికి.. చూపులేదు నిన్ను చూపటానికి....
నన్ను నీవుగా మార్చిన జ్ఞాపకాలకు.. గొంతులేదు నీతో చెప్పడానికి....

ఈ హృదయం.. ఇక నీ హృదయం....
ఉండలేనే నిన్ను చూడనిదే ప్రతీ ఉదయం....

సకలం నీవై రావే, చెలీ.. నా ప్రేమ లోకంలో....
సర్వం నీవైయావే, సఖీ.. నా జీవన గమనంలో....

నువ్వు నా దానవే.. అని నేడు నా ప్రేమపై ప్రమాణం చేయి....
నువ్వు నా నీడవే.. అని చెప్పు నా ప్రాణం పోయినా వదలను నీ చేయి....

నువ్వు నమ్మినా నమ్మకున్నా నిన్నే నింపుకున్న హృదయం....
ఈ వాగ్దానం చేస్తుంది, ఏదో ఒక రోజు ఋజువు చేస్తా ప్రియతమా.. నా ప్రపంచమా....! విశ్వ...!

ఓ నా ప్రియతమా...! విశ్వ..!

వాలు కనుల వగలమారి హొయల వయ్యారమా...
ఓర చూపుల వలలు విసిరే గాలమా...
చిలిపి తలపుల అలలు తాకే మనోరమా...
తొలి వలపు పులుపు తెలిపిన కాలమా...
చిరు జల్లులా నన్ను చేరే ప్రణయ విహారమా...
సిరి వెన్నెల వన్నెలు జల్లే తుహిన వర్షమా...
హరి విల్లుల వర్ణాల మిన్ను కోరే అందని అందమా...
సిరి మువ్వల నవ్వుల ఆనంద హర్షమా...
తొలకరి చినుకులు చిలికే సొగసరి తమకమా...
ప్రియ రాగపు శృతులు పలికిన పరువమా...
హృదయ వీణను మీటిన సుస్వరాల మధురిమా...
ఉదయ సంధ్యా రవి కిరణమా...
ఉభయ అధరాల దరహాసమా...
చిగురించే చిరు ఆశల తీరమా...
వికసించే విర జాజుల లీలా చిద్విలాసమా...
విహరించే మనోహర స్వప్న విహంగమా...
పల్లవించే అనురాగ సుధా అంతరంగమా...
మరణాన్ని మరల్చి వచ్చే జననమా...
చరణాన్ని స్మరించి తరించే గానమా...
కిరణాన్ని హరించి పతిధ్వనించే సంధ్యా రాగమా...
తామాసిని మాయజేసి ప్రజ్వలించే ప్రభాతమా...
తాపసిని మంత్రమేసి మత్తెక్కించే నాట్య భంగిమా...
తులసిని మరిపింప జేయు పవిత్ర మిత్రమా...
సన్యాసిని సంసారిగా చేయు విచిత్ర ఆత్రమా...
సన్నాసిని సమర్థునిగా మార్చు త్రినేత్ర అగ్ని హొత్రమా...
హృదయా(లయ)కారక తారక మంత్రమా...
రతీ మన్మధ సరసక్రీడా శృంగార తంత్రమా...
మనోరంజిత మంజీర వాణీ వినోదమా...
ముగ్ధ మనోహర కృష్ణ వేణీ తరంగామా...
మనస్సు బడి చేరిన అభినవ వేదమా...
వయస్సు మడి దాటిన ప్రణవ నాదమా...
విశ్వ విఖ్యాత యాసస్సుకి చిరునామా...
దయా హృదయ ఉషస్సుకి ప్రతిబింబమా...
లోక ప్రక్యాత తెజస్సుకి (ప్రేమకి) ప్రాకారమా...
నా జీవన శ్రీకారమా.. సాకారమా.. ఓంకారమా... ఓ నా ప్రియతమా...! విశ్వ..!

Wednesday, December 8, 2010

పల్లె ఒడి...! విశ్వ..!

నిండుగా కనిపించే పచ్చని అందాల చీర కట్టిన పైరు...
చిరుగాలి చిలిపిగా చక్కిలి గిలి పెడుతుంటే స్వేచ్చగా నవ్వుతుంది...
నిండుగా ప్రవహించే చల్లని పగడాల సెలయేటి నీరు...
చిరుగాలి వేగంతో వెంబడిస్తుంటే దొరకనంటూ పరవళ్ళు తొక్కింది...!!

తట్ల క్రింద గుట్టుగా గుడ్లు పెట్టిన కోడి పెట్టలు...
అప్పుడే పుట్టిన ఎర్రని సూర్యుడిని చూడగానే కూత పెట్టాయి...
అప్పుడప్పుడే నిద్ర లేచిన బుల్లి వల్లంగి పిట్టలు...
ఆకలితో కీచు కీచు మంటూ ఆకాశంలోకి రివ్వున ఎగిరాయి...!!

ముసిరిన పొగమంచు ముసుగులో ఆడమగలు...
నిండైన చెంబులతో నిప్పులు తొక్కుతూ ముందుకు సాగేరు...
గంజి నీటిలో ఉల్లిపాయ నంజుకొని ఆలుమగలు...
కొడవలి నాగలి చేతపట్టుకొని సాగు భూమి చెంతకు చేరారు...!!

నీలి వర్ణపు దుస్తులు ధరించిన స్కూలు పిల్లలు...
సంచులలో పుస్తకాలను సర్దుకొని సర్కారు బడిలోకి పరుగు తీసారు...
బెత్తం పట్టుకొని వేచిచూస్తున్న స్కూలు పెద్దలు...
బడికి చేరిన పిల్లలకు విజ్ఞాన పరిజ్ఞానాన్ని భోదిస్తూ గురువులయ్యారు...!!

వాకిటిలో కల్లాబుజల్లి రంగవల్లులు దిద్దే ఆడపిల్లల...
హొయలు చేస్తూ చూపు తిప్పుకోలేని కుర్రాళ్ళు మంత్ర ముగ్ధులయ్యారు...
ఇంతలో అంతరాయంలా వచ్చిన ఆడపిల్లల పెద్దల...
కేకలు వింటూ ఉలిక్కిపడ్డ కుర్రాళ్ళు రెప్పపాటులో కనుమరుగయ్యారు...!!

సకుటుంబ సపరివార సమేతంగా జరిగే పెళ్ళి సందడి...
కళ్ళారా చూసి తరించేందుకు పరీక్షలు ముగించుకొని మా ఊరు వచ్చాను...
కల్మషంలేని మా పల్లె జనం చూపించే ప్రేమ సందడి...
మనసారా ఆస్వాదించేందుకు తాతాబామ్మల గూటికి గువ్వలా వచ్చి చేరాను...!!

వస్తూనే నాటికి నేటికి ఏమాత్రం మారానని పల్లె వడిలో...
దాచుకున్న అందచందాలను తనివి తీరగా చూస్తూ తన్మయత్వం చెందాను...
వస్తూనే నేటి వరకు జీవించిన పట్టణ జీవన అలజడిలో...
కోల్పోయిన అనురాగ బంధాలను పట్టలేని ఆనందం సాక్షిగా అనుభవించాను...!!

బామ్మ చేసిన చిల్లు గారె కారం, పూర్ణం బూరె మధురం...
పులి హొర పులుపు పొగరు, ఉసిరి పచ్చడి నలుపు వగరు...
ఆహా..! ఏమి రుచి...!! ఔరా..! అనరా మైమరచి...!!
బామ్మ చెప్పిన నీతి కధలు, తాతయ్య చెప్పిన కబుర్లు...
జీవితంలో మరువలేని మరపురాని మధుర జ్ఞాపకాల గుడి, మా పల్లె ఒడి...! విశ్వ..!

ఎళ్ళిపోయినాది...! విశ్వ..!

మూడేండ్లు మనసారా ప్రేమించి పెద్దోళ్ళనెదిరించి మూడు ముళ్ళేసినా...
నూరేండ్లు సుఖంగా కలిసి బ్రతకాలని ఎంకన్న సామికి పదే పదే మొక్కినా...

మూడంతస్తుల మేడ కట్టి పెళ్ళాం పిల్లలతో కాపురముండాలని కలలు కనినా...
పెళ్ళాం నెలతప్పినాదని డాక్టరమ్మ సెప్తే సంబరంతో ఎగిరి గంతులేసినా...

ముడోనేల నుండి నెలలు నిండే దాకా కాలు కందనీకుండా జాగ్రత్తా సూసుకొనినా...
పుట్టబోయే నా బిడ్డకు ఏలోటు లేకుండా సూసుకోనీకి ముందే అన్నీ కొనిపెట్టినా...

బిడ్డ పుట్టినాక తల్లీ బిడ్డా సల్లంగుండాలని రాములోరి గుడిలో పూజలు సేసినా...
కాని రాములోరు నన్ను సల్లంగ సూడలే... ఎంకన్న సామికి నా మొర వినబడలే...

కళ్ళు తెరవని పసి కూనను నా సేతుల్లో పెట్టి, నా ప్రాణం కళ్ళు మూసినాది...
కన్న బిడ్డను ప్రాణంగా సూసుకోమని సెప్పి నన్నొదిలి ఎళ్ళిపోయినాది...! విశ్వ..!