Sunday, February 27, 2011

ముమ్మాటికి నిజమే...! విశ్వ..!

మగ వాని హృదయాలు కటినమైన, కర్కసమైన చలనం లేని రాతి బండలట...
ఆడ వారి హృదయాలు మృధువైన, సున్నితమైన మలినం లేని వెన్న ముద్దలట...

నిజమే... ఇది ముమ్మాటికి నిజమే...

హృదయపు రాతి బండపై చెక్కిన చెలి అపురూప శిల్పాన్ని...
ముక్కలు చెక్కలు చేయాలే కాని మరమత్తులు చేయుట అసాధ్యం...
ఒకరు రూపాన్ని కొలువుంచిన ఆ బండబారిన హృదయంలో...
మరొక రూపాన్ని ఊహించడం ఉలి దెబ్బలు తిన్న ఆ శిలకు చేతకాదు...
అందుకే అన్నారు రాతి బండ లాంటి హృదయం మగ వానిది అని...

నిజమే... ఇది ముమ్మాటికి నిజమే...

వెన్న ముద్దలాంటి హృదయాన్ని పెద్దల పోయ్యపై చేర్చి...
వారి మాయ మాటల మంటలలో ఎదలోని ప్రేమను కడ తేర్చి...
మరిగే ప్రియుని రూపాన్ని మరుగున పడేసి మనసుని మార్చి...
ప్రేమపై ఉన్న నమ్మకాన్ని వంచించి ప్రియుని చితిపై పేర్చి...
ఆ కాలాగ్నిలో రూపాంతరం చెందే వెన్న ముద్దలాంటి హృదయం ఆడ వారిది...

నిజమే... ఇది ముమ్మాటికి నిజమే...

మగ వాని ప్రేమ పగను ఎరుగని అచంచలమైనది, ఎన్నటికీ మార్పు చెందనిది...
ఆడ వారి ప్రేమ సందర్భానుసారంగా మార్పు చెందే చంచల స్వభావం కలిగినది...! విశ్వ..!

4 comments: